![]() |
![]() |

నిన్న జరిగన అగ్నిపరీక్ష ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఫుల్ జోష్ తో వచ్చారు. ఇక జడ్జెస్ ఎప్పటిలాగ కాకుండా కూల్ గా మాట్లాడతారు. ఇది లాస్ట్ ఛాన్స్.. ఇప్పటివరకు మిమ్మల్ని లైవ్ గా చుసాం.. ఇంకా రెండు రోజుల్లో టీవీలో చూస్తాం ఈ రెండు రోజులు బాగా ఆడండి అని అభిజిత్ చెప్తాడు. ఉన్న పదమూడు మందిలో ఓటింగ్ చూసి ఇక్కడ పర్ఫామెన్స్ చూసి అయిదుగురిని బిగ్ బాస్ సీజన్-9 లోకి పంపిస్తామని శ్రీముఖి చెప్తుంది.
ఇది లాస్ట్ పరీక్ష మహాపరీక్ష అని శ్రీముఖి టాస్క్ అందరికి వివరిస్తుంది. మొదటగా దివ్య ప్రియని సెలక్ట్ చేసుకుంది. వాళ్ళకిద్దరికి పెట్టిన టాస్క్ లో దివ్య గెలిచి మహాపరీక్ష నుండి ప్రియ అవుట్ అవుతుంది. దివ్య టాస్క్ గెలిచింది కాబట్టి తనకి మరొక ఛాన్స్ ఉంటుంది. దాంతో శ్రేయని దివ్య సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో కూడా దివ్య గెలుస్తుంది. శ్రేయ మహాపరీక్ష నుండి అవుట్ అవుతుంది. ఆ తర్వాత షకీబ్ కి ఛాన్స్ వస్తుంది. తను హరీష్ ని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో హరీష్ గెలుస్తాడు. షకీబ్ ఓడిపోయి మహాపరీక్ష నుండి అవుట్ అవుతాడు. ఆ తర్వాత హరీష్ నాగని సెలక్ట్ చేసుకుంటాడు. అందులో నాగ ఓడిపోయి మహపరీక్ష టాస్క్ నుండి అవుట్ అవుతాడు.
హరీష్, దివ్య చెరో రెండు టాస్క్ లు గెలుస్తారు. హరీష్ కి ఛాన్స్ రాగా అతను దివ్యని సెలక్ట్ చేసుకుంటాడు. ఇద్దరికి కలిసి టాస్క్ ని వివరిస్తుంది శ్రీముఖి. కానీ ఈ టాస్క్ ఇప్పుడు జరగదు.. ఎంత క్యూరియాసిటి ఉంది అందరిలో ఈక్వల్ ప్లేస్ లో ఉన్న వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామని శ్రీముఖి ట్విస్ట్ ఇస్తుంది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.
![]() |
![]() |